ఒక రోజు వర్షపు నీటిని ఒడిసిపట్టాడు వాటితో ఈ రైతు ఏం చేస్తున్నాడంటే

ఒక రోజు వర్షపు నీటిని ఒడిసిపట్టాడు వాటితో ఈ రైతు ఏం చేస్తున్నాడంటే

0
92

రైతు లేనిదే అసలు ఈ దేశం ఈ ప్రపంచం లేదు అని చెప్పాలి, వారు పండించిన పంట వల్లే ఇప్పుడు ఇలా ఉన్నాం, అయితే రైతులు ఈ మధ్య చాలా కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. పంటల్లో కూడా సరికొత్త విధానాలు అమలు చేస్తున్నారు.

ఒక రోజు రాత్రి కురిసిన వర్షం ఆ రైతు ఏడాది పాటు నీటికి కరువు లేకుండా చేసింది. తన మామిడి క్షేత్రానికి అవసరమైన సుమారు కోటి లీటర్ల నీటిని ఒడిసిపట్టాడు నిజంగా అతను చేసిన పనికి కర్నాటక రైతులు అందరూ ఆశ్చర్యపోయారు.

అంజినప్ప అనే రైతుకి చెందిన 40 ఎకరాల మామిడి తోటలోని మూడు బోరు బావులు ఎండిపోయాయి. దీంతో వర్షం నీటిని ఒడిసిపట్టాలని సంకల్పించి, 15 అడుగుల లోతుతో 180×180 అడుగుల సైజులో భారీ ఫాం పాండ్ను రూ.13లక్షలతో తవ్వాడు. ఇక కురుస్తున్న వర్షాలతో ఇక్కడ ఈ పౌండ్ నీరుతో నిండింది.
సుమారు కోటి లీటర్ల వరకు నీటి నిల్వ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం 4వేల మామిడి చెట్లకు ఏడాది పాటు ఈ నీరు సరిపోతుందని, అలాగే భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లోకి నీరు వస్తుందని రైతు సంతోషపడ్డాడు. నిజంగా అతని ప్లానింగ్ అద్బుతం అంటున్నారు నిపుణులు.