జాగిలాలు పోలీసుల దగ్గర ఎంత షార్ప్ గా ఉంటాయో తెలిసిందే, ఇలా దొంగ ఉన్నాడు అని తెలిస్తే వెంటనే క్యాచ్ చేస్తాయి, అందుకే పోలీస్ డాగ్స్ కు ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది, వాటికి అనుమానం వచ్చినా అరుపులు అరుస్తాయి, ఇక ఉస్కో అంటే దొంగోడు కచ్చితంగా చిక్కాల్సిందే.
నేరం జరిగిన పరిసరాల్లోని ఆనవాళ్లను గుర్తించడానికి మాత్రమే పనికి వస్తుంది అని అనుకుంటాం. అయితే వందల మీటర్లు మాత్రమే ఇవి వాసన చూసి దొంగలను గుర్తిస్తాయి అని అనుకుంటాం, కాని ఈ జాగిలం చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఓ జాగిలం మాత్రం ఏకంగా 12 కిలోమీటర్ల దూరంలో ఓ ఇంట్లో నక్కి ఉన్న హంతకున్ని పట్టించింది. నేరం జరిగిన ప్రాంతం నుంచి అతన్ని పట్టుకునే వరకూ పరిగెత్తి ఆచూకీ కనిపెట్టింది. కర్నాటకలో పదేళ్ల వయసున్న తుంగా అనే కుక్క ఈ ఘనత సాధించింది. ఈ జాగిలం టాలెంట్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు..ఇలా జరగడం వండర్ అంటున్నారు, ఈ కుక్క ఇప్పటికే దాదాపు 50కేసుల్లో నిందితులని పట్టించింది.