ఇదేం ఆచారం రా బాబు… ఈ దేశంలో ఏ యువతినైనా డైరెక్ట్ గా ఎత్తుకెళ్తొచ్చు…

ఇదేం ఆచారం రా బాబు... ఈ దేశంలో ఏ యువతినైనా డైరెక్ట్ గా ఎత్తుకెళ్తొచ్చు...

0
117

ఇండోనేషియా దేశంలో మారుమూల దీవి సుంబాల్లో ఒక పాడు ఆచారం ఉంది… ఈ దేశం ఆచారంతో అక్కడి యువతుల పాలిట శాపంగా మారింది…. ఒక అబ్బాయి ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆమెను బలవంతంగా ఎత్తుకువెళ్లోచ్చు.

ఇందుకోసం స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఏకంగా దండయాత్ర చేసి నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేయవచ్చు.ఈ ఆచారాన్ని నిషేధించారని ఇండోనేషియా మహిళా హక్కుల సంఘాలు చాలా కాలంగా పిలుపునిచ్చినప్పటికీ ఇండోనేషియాలోని లోని బాలికి తూర్పుగా కున్న శుంభ దీవి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది.

తాజాగా పెళ్లి చేసుకోవడం కోసం ఇద్దరు యువతులను కిడ్నాప్ చేస్తున్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఆచారానికి ముగింపు పలకాలని ఇండోనేషియా ప్రభుత్వం పిలుపునిచ్చింది.