10 లేదా 11 ఏళ్లకే అమ్మాయిలు ఎందుకు రజస్వల అవుతున్నారు ? కారణం ఇదే

10 లేదా 11 ఏళ్లకే అమ్మాయిలు ఎందుకు రజస్వల అవుతున్నారు ? కారణం ఇదే

0
116

ఏ అమ్మాయి అయినా ఒక వయసుకి వచ్చిన తర్వాత ,శరీరంలో కొన్ని హార్మోనులు విడుదల కావడం వలన మెన్స్ట్రువల్వల్ సైకిల్ పునరుత్పత్తి కి సంబందించిన అవయవాల పని ప్రారంభం అవుతుంది.
మొదటిసారిగా బీజకోశం నుండి వెలువడిన మొదటి అండం తన సమయం దాటిపోయాక గర్భాశయ గోడలను వదిలి బయటకు పోతుంది. ఆ సమయంలో కొంత రక్తం కూడా పోతుంది.

ఈ సమయంలో ఆమె రజస్వల అయింది అని అంటారు, అయితే గతంలో 13 లేదా 14 ఏళ్లకు రజస్వల అయ్యేవారు, కాని ఇప్పుడు చాలా చిన్న వయసులోనే రజస్వల అవుతున్నారు అమ్మాయిలు, అయితే దీనికి కారణాలు చెబుతున్నారు డాక్టర్లు.

తల్లిదండ్రులు వారికి పెట్టె ఆహారం వలన ఇలా జరుగుతుంది. పిజ్జాలు, బర్గర్లు , హార్మోను ఇంజక్షన్లు ఇచ్చిన కోడి మాంసాలు, ప్యాకెట్ పాలు, ఫారమ్ గుడ్డు, ఇతర జంక్ ఫుడ్ లోని కొవ్వు పదార్ధాలు ఇలాంటివి తినడం వల్ల చిన్నవయసులోనే రజస్వల అవుతున్నారు. ఈ ఫుడ్ కి కాస్త దూరంగా ఉంచితే మంచిది అని డాక్టర్లు తెలియచేస్తున్నారు.