సచిన్ టెండుల్కర్ గురించి మీకు తెలియని విషయాలు

సచిన్ టెండుల్కర్ గురించి మీకు తెలియని విషయాలు

0
132

మన దేశంలో క్రికెట్ కి గాడ్ అంటే సచిన్ అని చెబుతారు, దేశంలో సచిన్ అంటే అందరూ అభిమానిస్తారు…ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్, ఆయన ముంబైలోని బ్రాహ్మణ కుటుంబంలో ఏప్రిల్ 24, 1973 న జన్మించాడు. తండ్రి రమేష్ మరాఠీ నవలా రచయిత.

1995లో గుజరాత్ పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అంజలిని వివాహం చేసుకున్నాడు.సచిన్ కు ఇద్దరు పిల్లలు. సారా, అర్జున్ , ఇక సచిన్ తన గురువు రమాకాంత్ అచ్రేకర్ సలహాతో శారదాశ్రమ్ విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో చేరాడు.

సచిన్ యువకుడిగా ఉన్న సమయంలో కోచ్ అచ్రేకర్ మాటలు బాగా వినేవాడు..గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు. 1988/1989 లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 100 పరుగులు సాధించాడు, ఇక రికార్డుల మోత సృష్టించాడు సచిన్.

రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు సచిన్ ..తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ 1989లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 1994 నుంచి సచిన్ ఆట అద్బుతంగా సాగింది,

.