పద్మవ్యూహం నుంచి అభిమన్యుడు ఎందుకు బయటకు రాలేకపోయాడో తెలుసా?

పద్మవ్యూహం నుంచి అభిమన్యుడు ఎందుకు బయటకు రాలేకపోయాడో తెలుసా?

0
176

మహాభారతం ఓ చరిత్ర అనే చెప్పాలి, ఇందులో ప్రతీ అంశం మనకు జీవితంలో ఉపయోగపడుతుంది, అయితే ఇందులో పద్మవ్యూహం మాత్రం ఈ భూమి ఉన్నంత వరకూ అందరికి గుర్తు ఉంటుంది, ఎంతో దుర్భేద్యమైనది ఈ వ్యూహం.

అర్జునుడు కుమారుడు అభిమన్యుడు వీరోచితంగా పోరాడి తనప్రాణాలు పొగొట్టుకున్నాడు, అతను పద్మవ్యూహాంలోకి వెళ్లాడు కాని తిరిగి బయటకు రాలేకపోయాడు దానికి కారణం ఉంది. ఒకసారి సుభద్రకు అర్జునుడు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు.

అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు, ఆ సమయంలో ఆమె నిద్రలోకి జారుకుంది, దీంతో బయటకు రావడం మాత్రం అతనికి తెలియలేదు. చివరకు అదే అతని ప్రాణాలపైకి తెచ్చింది. అందుకే అభిమణ్యుడు వీరుడు అయ్యాడు.