ముందు తలారా స్నానం ఆచరించాలి, దేవుడి గది శుభ్రం చేసి, ముందు పసుపుతో వినాయకుడ్ని చేసి పూజించాలి, కలశంలో వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేయాలి.
కొత్త అక్షింతలు కలిపి పిల్లలలు భర్తకు ఇవ్వాలి, ముత్తైదువులకి అవి ఇచ్చి ఆశీర్వచానాలు తల్లిదండ్రుల దగ్గర తీసుకోవాలి. తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి
తర్వాత అమ్మవారికి 9 రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టాలి..ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.
ఇక తోరగ్రంథి పూజ
తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయాలి అవి తోరణాలుగా కట్టుకోవాలి.
వ్రత కధ ఇదే ….
ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరిలో ఉన్న సమయంలో పార్వతీ దేవి ఓ ప్రశ్న అడుగుతుంది, స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతం చెప్పమని కోరుతుంది
అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును అని చెబుతాడు
ఈ వ్రతం శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను
అని పార్వతికి తెలియచేస్తాడు పరమశివుడు,
పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరం ఉంది. అది ఎంతో అందమైన పట్టణము. అక్కడ చారుమతి అనే ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమెకు కలలో ప్రత్యక్షమై ఆమెతో, చారుమతీ నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలసిన వరం అడగమంటుంది. ఆమె కోరుకుంటుంది.
నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయమని చెబుతుంది
ఈ సమయంలో తనకు వచ్చిన కలను తన భర్తకు చెబుతుంది. ఆ పట్టణంలో స్త్రీలు అందరికి చెబుతారు,
చారుమతి వారందరితో కలసి పూజ చేస్తుంది…పూజ ముగిసిన తర్వాత వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, ఆభరణములు కనిపించెను. బ్రహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆనందంగా ఉన్నారు వారు అందరూ , వారి పట్ణణం అంతా ఏ ఇబ్బంది లేకుండా ఉంది, ఇలా ప్రతీ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆచరించారు..