ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు మహిళలు, ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి, అయితే ఈరోజు అమ్మవారికి పూజ చేసి ఈ కధ చదివినా విన్నా ఎంతో మంచిది. ఆ ఇంట శాంతి ఆనందం ఉంటుంది, మరి ఆ కథ చూద్దాం
ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరిలో ఉన్న సమయంలో పార్వతీ దేవి ఓ ప్రశ్న అడుగుతుంది, స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతం చెప్పమని కోరుతుంది
అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును అని చెబుతాడు
ఈ వ్రతం శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను
అని పార్వతికి తెలియచేస్తాడు పరమశివుడు,
పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరం ఉంది. అది ఎంతో అందమైన పట్టణము. అక్కడ చారుమతి అనే ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమెకు కలలో ప్రత్యక్షమై ఆమెతో, చారుమతీ నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలసిన వరం అడగమంటుంది. ఆమె కోరుకుంటుంది.
నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయమని చెబుతుంది
ఈ సమయంలో తనకు వచ్చిన కలను తన భర్తకు చెబుతుంది. ఆ పట్టణంలో స్త్రీలు అందరికి చెబుతారు,
చారుమతి వారందరితో కలసి పూజ చేస్తుంది…పూజ ముగిసిన తర్వాత వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, ఆభరణములు కనిపించెను. బ్రహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆనందంగా ఉన్నారు వారు అందరూ , వారి పట్ణణం అంతా ఏ ఇబ్బంది లేకుండా ఉంది, ఇలా ప్రతీ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆచరించారు..