కరెన్సీ నోట్లు ఏం చేశాడో తెలిసి షాకైన బ్యాంకు సిబ్బంది

కరెన్సీ నోట్లు ఏం చేశాడో తెలిసి షాకైన బ్యాంకు సిబ్బంది

0
134

ఈ కరోనా సమయంలో చాలా మంది అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏదైనా వస్తువులు కూరగాయలు ఏమి కొన్నా ముందు వాటిని కడిగేస్తున్నారు, ఇలా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అయితే ఈ కరోనా కరెన్సీ నుంచి కూడా వస్తుంది అని చెప్పడంతో కొందరు అతి తెలివి చూపిస్తున్నారు.

వాటిని ఐరెన్ బాక్స్ పై పెట్డడం, అలాగే వాటికి శానిటైజర్ కొట్టడం ఇలా చేస్తున్నారు, ఏకంగా
దక్షిణ కొరియాకు చెందిన ఓ వ్యక్తి ఇంకో అడుగు ముందుకేశాడు. కరెన్సీ నోట్లపై కరోనా వైరస్ ఉండొచ్చేమోనన్న అనుమానంతో వాటిని వాషింగ్మెషిన్లో వేశాడు. డబ్బులు తడుస్తాయి అన్న ఆలోచన వచ్చిందేమో.. వెంటనే బయటకు తీశాడు.

కాని అవి అన్నీ తడిచిపోయాయి, ఉండకట్టేశాయి, వెంటనే వాటిని మైక్రోవేవన్ వేశాడు, చివరకు అన్నీ సగం కాలి చిల్లులు పడ్డాయి, ఆ నగదు బ్యాంకుకి తీసుకువెళితే వారు తీసుకోము అన్నారు, వాటిపై నెంబర్లు కూడా లేవు అని అధికారులు తెలిపారు.. చివరకు అందులో 40 కాగితాలు తీసుకున్నారు.. వాటికి నగదు ఇచ్చారు. మిగిలిన అరవై కాగితాలు పనిచేయవు అని చెప్పడంతో వచ్చిందే సంతోషం అని ఇంటికి వెళ్లాడు ఈ వ్యక్తి.