వారు వైసీపీలో చేరడం లేదు బ్రేక్

వారు వైసీపీలో చేరడం లేదు బ్రేక్

0
88

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట విషాద చాయలు అలముకున్నాయి.. వైయస్ వివేకానందరెడ్డి మరణం ఆకుటుంబాన్ని కలిచివేసింది అని చెప్పాలి ఇక మరో 24 గంటల్లో జగన్ తన పార్టీ తరపున తొలిజాబితా విడుదల చేయనున్నారుఈ సమయంలో ఇలాంటి విషాదం జరగడం ఆకుటుంబాన్ని కలిచివేసింది. వైయస్సార్ సీపీ అధికారంలోకి రావాలి అని జగన్ సీఎం అవ్వాలి అని ఎన్నో కలలు కన్నారు వైయస్ వివేకా.

అయితే నేడు మాగుంట్ల శ్రీనివాసుల రెడ్డి, కొణతాల రామకృష్ణ పలువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలి అని భావించారు. కాని వైయస్ జగన్ ఇప్పుడు పులివెందుల వెళ్లడంతో లోటస్ పాండ్ లో నేతల చేరికలకు బ్రేక పడింది. జగన్ మళ్లీ వచ్చిన తర్వాత రేపు అభ్యర్దుల ప్రకటన ఉంటుందో లేదో తెలుసుకుని దాని ప్రకారం పార్టీలో చేరికలు ఉంటాయి అని చెబుతున్నారు పార్టీ నాయకులు. మొత్తానికి వైయస్ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న వివేకా మరణం ఆయన కుటుంబాని పెద్ద షాక్ అనే చెప్పాలి.