రానాతో పెళ్లిలో మిహీక ధరించిన డ్రెస్ ఖరీదు తెలిస్తే మ‌తిపోతుంది

రానాతో పెళ్లిలో మిహీక ధరించిన డ్రెస్ ఖరీదు తెలిస్తే మ‌తిపోతుంది

0
120

రానా మిహీక బ‌జాజ్ వివాహం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది, రామానాయుడు స్టూడియోలో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఈ వివాహం జ‌రిగింది, కేవ‌లం ఇరువురు కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హ‌జ‌రు అయ్యారు, ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు ఈ వివాహానికి.

ఈ పెళ్లిలో రానా, మిహీక ఇద్దరూ డిజైనర్ పెళ్లి దుస్తుల్లో ధగధగ మెరిసిపోయారు. ఇప్ప‌టికే వివాహానికి సంబంధించి ఫోటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి,

ఇక మ‌రీ స్పెష‌ల్ గా ఓ విష‌యం చ‌ర్చించుకుంటున్నారు అంద‌రూ…వధువు మిహీక ధరించిన లెహంగా డ్రెస్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. లైట్ గోల్డెన్ కలర్ లో క్రీమ్ మిక్స్ అయినట్టుగా ఉన్న ఈ లెహంగా చాలా బాగుంది అంటున్నారు, అయితే దీని ఖ‌రీదు కూడా అదే రేంజ్ లో ఉంటుంది అంటున్నారు డిజైన‌ర్లు.

ఈ ఒక్క డ్రెస్ ధర రూ.6 లక్షలు అని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా ఎంతో శ్రమించి మిహీకా డ్రెస్ ను డిజైన్ చేశారు. ఈ డిజైన్ వ‌ర్క్ అంతా చేతుల‌తో చేశార‌ట‌.