కార్తీక దీపం- వంట‌ల‌క్క అభిమానుల‌కి గుడ్ న్యూస్

కార్తీక దీపం- వంట‌ల‌క్క అభిమానుల‌కి గుడ్ న్యూస్

0
144

డాక్ట‌ర్ బాబు వంట‌ల‌క్క ఎప్పుడు క‌లుస్తారో అని కార్తీక దీపం సీరియ‌ల్ చూసే ప్ర‌తీ ఒక్క‌రు అనుకుంటారు, డాక్ట‌ర్ బాబు వంట‌ల‌క్క క‌ల‌వాలి అని పూజ‌లు చేసేవారు ఉన్నారు, మ‌న తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియ‌ల్ అంత ఫేమ‌స్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్‌ ఇది. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అయితే ఈ సీరియల్‌ అభిమానుల కోసం మరో గుడ్‌న్యూస్ చెప్పారు దర్శకనిర్మాతలు.

ఈ సిరియ‌ల్ రోజు 30 నిమిషాలు మాత్ర‌మే వ‌చ్చేది.. కాని ఇప్పుడు దీనిని మ‌రో 15 నిమిషాలకు పెంచారు. ఈ సీరియల్‌తో పాటు దాని తరువాత వచ్చే గృహలక్ష్మి సీరియల్‌ని కూడా మరో 15 నిమిషాలు పెంచారు.
అంటే ఇక‌పై ఈ రెండు సీరియ‌ల్స్ 45 నిమిషాలు వ‌స్తాయి, ఇక వంట‌ల‌క్క అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్ అంటున్నారు అంద‌రూ.