ఆ కృష్ణుడు ఏం చేసినా దాని వెనుక ఓ పరమార్ధం ఉంటుంది, అయితే ఆ కృష్ణుడు 8 మందిని వివాహం చేసుకున్నాడు అని అందరికి తెలుసు, కాని గోపికల పేరు చెబితే కిట్టయ్య 16 వేల మంది గోపికలను వివాహం చేసుకున్నాడు అంటారు.. అయితే ఇలా ఎందుకు చేసుకున్నాడు దీని వెనుక ఓ కథ ఉంది అది తెలుసుకుందాం.
నరకాసురుడు అనే రాక్షసుడు తన రాజభవనంలో 16 వేల మంది మహిళలను బంధించాడు. శ్రీకృష్ణుడు సత్యాభామ సమేతుడై నరకాసురుడుని సంహరించాడు, ఈ సమయంలో 16 వేల మందిని రక్షించాడు, ఈ సమయంలో అతని బంధీలో ఉన్న వారిని.
వారి తల్లిదండ్రులు ఎవరూ సాకలేదు, దీంతో వారికి అండగా శ్రీకృష్ణుడు నిలిచాడు.. అలా 16 వేల మందిని శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. ఒకేరోజు 16 వేల మందిని పెళ్లి చేసుకుని వారికి ఆశ్రయం కల్పించాడు. అంతేకాకుండా వీరిని గౌరవించేందుకు గాను ఓ కోట నిర్మించి ఇచ్చాడు. వారు అందరూ చివరి వరకూ అక్కడే ఉన్నారు.ఇది ఆ నాడు వివాహం జరగడానికి కారణం.