మ్యాగీ అంటే ఇష్ట పడని వారు ఉండరు …జస్ట్ 5 నిమిషాల్లో మ్యాగీ చేసుకుని తింటాము అని చిన్న పిల్లలు కూడా చెబుతారు, ఈజీగా చేసుకుంటారు ఈజీగా తింటారు.. పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టం, ఇక స్నాక్స్ గా ఈవినింగ్ అమ్మలు ఇదే చేస్తారు.
ఇక మ్యాగీ ప్యాకెట్ లో ఉండే మసాలా టేస్టే వేరు, అసలు మ్యాగీ కి సేల్స్ పెరగడానికి కూడా ఈ మసాలా పౌచ్ ఓ కారణం అనే చెప్పాలి, బయట ఎక్కడా ఇలాంటి మసాలా దొరకదు. అది మ్యాగీ టేస్ట్ అనే చెప్పాలి, అయితే ఓ వ్యక్తి మ్యాగీ ప్యాకెట్ కొనుక్కుంటే.
అందులో ఒకటే మసాలా ఉండాలి కదా, కాని అతనికి ఏకంగా రెండు మసాలా ప్యాకెట్స్ వచ్చాయి, దీనిని అతను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు, ఈ మసాలా రెండు ప్యాకెట్లు వేసుకుని ఒకేసారి తింటున్నా అని తన ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలిపాడు.. దీనికి లక్షల్లో లైక్స్ వచ్చాయి, అయితే ఒక్కోసారి ప్యాకింగ్ జరిగే సమయంలో ఇలా వస్తూ ఉంటాయి అంటున్నారు వ్యాపారులు, మొత్తానికి నువ్వు లక్కీ పర్సన్ అంటున్నారు అతనిని సోషల్ మీడియాలో అందరూ.