అతనికి వాన అదృష్టం తెచ్చింది కోటీశ్వరుడ్ని చేసింది

అతనికి వాన అదృష్టం తెచ్చింది కోటీశ్వరుడ్ని చేసింది

0
94

ఒక్కోసారి కొందరికి అదృష్టం కలిసి వస్తుంది, లాటరీ రూపంలో కూడా చాలా మంది కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు, అలాగే ఓ వ్యక్తికి ఏకంగా వర్షం లాటరీ రూపంలో నగదు తెచ్చిపెట్టింది, దీంతో అతను చాలా ఆనందంలో ఉన్నాడు.

మరీ ముఖ్యంగా అతని ఆనందానికి అవధులు లేవు అనే చెప్పాలి, ముఖ్యంగా అతను సరదాగా కొన్న లాటరీ అతని జీవితానికి ఓ మార్గం చూపించింది.. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో ఓ వ్యక్తి విషయంలో జరిగింది.

అమెరికాలోని వర్జీనియా.. పీటర్స్బర్గ్లో ఉండే గార్లాండ్ హ్యరీసన్ అనే వ్యక్తి ఏదో పనిమీద బయటకు వెళ్తుండగా దారిలో అనుకోకుండా భారీ వర్షం పడింది. ఈ సమయంలో అక్కడ మాల్ లోకి వెళ్లాడు, అప్పుడు అక్కడ సమయం గడవడం లేదు.. అక్కడ లాటరీ షాపుకి వెళ్లి ఓ లాటరీ తీసుకున్నాడు కొద్ది రోజులకి వారి నుంచి ఫోన్ వచ్చింది… మీరు కొన్న లాటరీకి కోటి 18 లక్షలు తగిలింది అని చెప్పారు, దీంతో అతను ఆశ్చర్యపోయాడు, చాలా ఆనందించాడు.