మనం గుడికి వెళ్లిన సమయంలో కచ్చితంగా తీర్ధం తీసుకుంటాం, అయితే ఎందుకు ఇలా గుడిలో తీర్దం ఇస్తారు అనేది చాలా మందికి తెలియదు, దీనికి ఎంతో విశిష్టత ఉంది. తీర్థం అంటే దేవుడి అభిషేక ద్రవ్యం, దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. శివుడికి, లేదా శ్రీ మహావిష్ణువున్నిసాలగ్రామ శిలలకు అభిషేకం చేసిన జాలలను ఇలా తీర్దంగా ఇస్తారు.
శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు. ఈ తీర్ధమును అర్చన పూర్తి అయిన వెంటనే ముందుగా అర్చక స్వామి తీసుకుని తర్వాత భక్తులక ఇస్తారు, ఇక విష్ణు ఆలయాల్లో తులసి తీర్ధం ఇస్తారు… తీర్దం తీసుకునే సమయంలో తీర్దం క్రింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా
తీసుకోవాలి.
తీర్దం త్రాగిన తర్వాత కుడి చేతిని తలపై రాసుకోవద్దు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. ఇక తీర్దం తీసుకునే సమయంలో కొందరు శబ్దం చేస్తారు ఇలా కూడా చేయకూడదు..తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి