మన తెలుగు యాంకర్లు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో తెలుసా

మన తెలుగు యాంకర్లు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో తెలుసా

0
96

యాంకరింగ్ ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు, కాని టాలీవుడ్ లో ముందు వినిపించే పేరు యాంకర్ సుమదే, ఆమె తర్వాత ఎవరైనా, ఇటు షోలు, ఈవెంట్స్, సినిమా ఫంక్షన్లు ఇలా ఏది చేసినా ముందు సుమకే ఫోన్ వెళుతుంది, ఆమె డేట్ ఖాళీ లేదు అంటే వేరే వారిని చూస్తారు, చలాకీగా మాట్లాడటం సుమ చేసే యాంకరింగ్ అందరికి నచ్చుతుంది.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి, ఉంది.. యాంకరింగ్ చేసే సమయంలో అక్కడకు వచ్చిన వారిని నొప్పించకుండా వారికి ఇబ్బంది లేని ప్రశ్నలు వేస్తూ అందరితో సమానంగా యాంకర్ గా నవ్వించాలి. అలరించాలి.. ఇది చాలా పెద్ద టాస్క్ అంటున్నారు టాలీవుడ్ పెద్దలు, అలా టాలీవుడ్ లో బుల్లితెరలో చాలా మంది యాంకర్లు ఉన్నారు.

తెలుగులో సుమ ఇప్పటికీ అగ్రస్దానంలో ఉన్నారు యాంకర్ గా, ఇక బుల్లితెరపై శ్రీముఖి, అనసూయ, రేష్మి వర్షిని, ఇలా చాలా మంది యాంకర్లుగా ఉన్నారు, మరి వీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అనేది చాలా మందికి తెలియదు.మరి వారి రెమ్యునరేషన్ చూద్దాం.

సుమ ఒక్కో షోకి సుమారు 2 లక్షలు
ప్రదీప్ మాచిరాజు 1.50 లక్షలు
అనసూయ 1.50 లక్షలు
రష్మి 1.25 లక్షలు
యాంకర్ రవి 1 లక్ష నుంచి 75 వేలు
శ్యామల 50 వేల నుంచి 60 వేలు
వర్షిణి 40 నుంచి 50 వేలు
మంజూష 30 వేల నుంచి 40 వేలు
శిల్పా చక్రవర్తి 25 వేల నుంచి 35 వేలు
గాయత్రి భార్గవి 25 వేల నుంచి 35 వేల వరకూ తీసుకుంటారు అని తెలుస్తోంది.