ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు తవ్వేకొద్ది బయటకు వస్తున్నాయి.. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చల విడిగా అక్రమాలు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే…..
అయితే ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే… తాజాగా మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పై సీబీఐ కేసు నమోదు చేసింది… ఆయనపై అక్రమ మైనింగ్ కేసు నమోదు చేసింది సీబీఐ…
కోనంకీ, కేసానుపల్లి, నడికుడిలో జరిగిన అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణ జరుపుతోంది… లై స్టోన్ అక్రమ మైనింగ్ పై విచారణ ముమ్మరం చేసింది సీబీఐ… ఈ కేసుల భాగంగా యరపతినేని శ్రీనివాస్ అనుచరులు సుమారు 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది… అలాగే దాచేపల్లి, పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులను కూడా పరిగణలోకి తీసుకుంది సీబీఐ.