మనలో చాలా మంది గుడికి వెళ్లిన సమయంలో తీర్దం తీసుకుంటాం. అయితే కొందరు జుర్రున శబ్దం చేసి తీసుకుంటారు.. మరికొందరు ఒకసారి మాత్రమే తీసుకుంటారు, ఇంకొందరు తీర్ధం త్రాగినప్పుడు జుర్రుమని శబ్దం చేస్తారు.. ఇలా మాత్రం చేయద్దు అంటున్నారు పండితులు, అలాగే తీర్దం ఎప్పుడూ పారబోయకూడదు, అలాగే తీర్దం తీసుకున్న తర్వాత దానిని తలకి రాయకూడదు.
అయితే తీర్దం ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది కూడా చెబుతున్నారు పండితులు.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకోవాలి. అలా మూడు సార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు.అది కూడా చూద్దాం.
1..మొదటిసారి తీర్థం శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. ఇలా మొదట సారి తీసుకుని ఇష్ట దైవాన్ని తలచుకోవాలి.
2.. రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి.
3) మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి.
కచ్చితంగా మూడు సార్లు తీర్దం తీసుకోవాలి, గుడిలో అయినా ఇంటిలో జరుగుతున్న పూజలో అయినా అంటున్నారు పండితులు.