పీవీపీ దూకుడు సైకిల్ పంక్చర్

పీవీపీ దూకుడు సైకిల్ పంక్చర్

0
114

ఈసారి విజయవాడ పార్లమెంట్ స్ధానం నుంచి వైసీపీ తెలుగుదేశం మధ్య సరికొత్త పోటీ అయితే కనిపిస్తోంది.. సిట్టింగ్ ఎంపీగా ఉన్నకేశినేని నానికి మరోసారి అవకాశం ఇచ్చారు చంద్రబాబు.. ఇటు పీవీపీకి వైసీపీ తరపున జగన్ టికెట్ ఇచ్చారు, అయితే విద్యాలయాలు వ్యాపారాలు ఉండటం స్ధానికంగా బంధుగణం ఎక్కువ మంది ఉండటం, విజయవాడ సొంత ప్లేస్ కావడం రాజకీయాల్లోకి ఎప్పటి నుంచో రావాలి అనే ఆలోచనతో ఉన్న పీవీపీకి జగన్ ఈసారి టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చారు.. అయితే ఇక్కడ వైసీపీ కేడర్ చాలా బలంగా ఉంది. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి.

ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నానికి 6 నెలలుగా సపోర్ట్ లేరు అని తెలుస్తోంది ..విజయవాడ అభివృద్ది అనుకున్నంత జరగలేదు అని దుర్గగుడి ప్లై ఓవర్ మెట్రో అన్నారు ఇలా చెప్పిన హామీలు నెరవేర లేదు అనే అసంతృప్తి ప్రజలలో ఉంది.. ముఖ్యంగా రోడ్ల పై చేసిన ఫోకస్ అభివృద్దిపై చేయలేదు అని అంటున్నారు ఇక్కడ జనం.. అంతేకాదు ఓసారి విద్యావంతుడు అయిన పీవీపీకి ఓ అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారట. అయితే జగన్ పలు సర్వేలు చేసి పీవీపీ అభ్యర్దిత్వం ఫైనల్ చేశారు అని తెలుస్తోంది భారీ మెజార్టీతో పొట్లూరి వర ప్రసాద్ విజయం సాధిస్తారట విజయవాడ పార్లమెంట్ స్ధానంలో.