సకల సౌకర్యాలు ఉండి మనకంటూ కాస్త పీస్ ఫుల్ గా ఉండే ప్రాంతం ఉంటే అక్కడకు వెళ్లాలి అని చాలా మంది అనుకుంటారు… అయితే అబ్బాయిలకి ఇలా చాలా సౌకర్యాలు ఉంటాయి, అయితే అమ్మాయిలకి కూడా ఇలాంటి సౌకర్యం ఉంటే, చాలా బాగుంటుంది కదా…అలాంటి ప్లేస్ ఉంది…ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం అక్కడ అమ్మాయిలు మాత్రమే ఉంటారు.. పురుషులకి నో ఎంట్రీ మరి అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంది అనేది చూద్దాం.
ఫిన్‌లాండ్‌లోని ఓ ఐలాండ్‌లో మాత్రం కేవలం స్త్రీలకే అనుమతిస్తారు. మగవారికి అక్కడి ప్రవేశం నిషేధం. ఇది సుమారు 9 ఎకరాల ప్రాంతంలో ఉంది, దీనిపేరు కూడా సూపర్ షీ, అమెరికాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త క్రిస్టినా రోత్ ఈ ఐలాండ్‌కు యజమాని. ఇక్కడకు కేవలం మహిళలు మాత్రమే రావాలి వారికి ఎంట్రీ ఇస్తారు.
ఇక్కడ రెస్టారెంట్ ఉంది. పార్టీల కోసం ఇక్కడకు వస్తారు రిసార్ట్ కూడా ఏర్పాటు చేశారు..
ఇక్కడ అతిథుల కోసం ప్రత్యేక గదులు, స్పా, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. అలాగే రకరకాల వంటలను నచ్చిన విధంగా వండి పెడతారు.
యోగా చేసుకోవచ్చు, ఇక్కడ వర్క్ చేసేవారు కూడా అందరూ లేడీస్ ,కనీసం పది మంది మహిళలు బృందంగా ఏర్పడి ఈ ఐలాండ్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రతీ రోజు బిజీగానే ఉంటుంది.. ఇప్పుడు బుక్ చేస్తే అక్కడకు మరో నెలకి మనకు అవకాశం దోరుకుతుంది అంటున్నారు చాలా మంది మహిళలు.