ఐపీఎల్ 2020కి తెలుగులో కామెంటేటర్ ఎవ‌రంటే

ఐపీఎల్ 2020కి తెలుగులో కామెంటేటర్ ఎవ‌రంటే

0
93

ఐపీఎల్ 2020 సీజన్ కు మ‌రికొన్ని రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.. ఈ నెల 19 నుంచి యూఏఈ వేదిక‌గా ప్రారంభంకాబోతోంది ఈ సీజ‌న్. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సుదీర్ఘ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్‌లు జరగబోతున్నాయి.

ఇక స్టార్ట స్పోర్ట్స్ లో మ్యాచులు చూడ‌వ‌చ్చు, మ‌రి ప‌లు ప్రాంతీయ భాష‌ల్లో కూడా ఈ మ్యాచులు చూసే అవ‌కాశం ఉంది, ఆ కామెంటేటర్ ల ఎక్స్ ప్లేనేష‌న్ కూడా చాలా మందికి న‌చ్చుతాయి, ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళంలో కామెంటేట‌ర్ చెప్పే వ్యాఖ్యాతల జాబితాని విడుదల చేసింది.

మ‌రి తెలుగులో ఎవ‌రు చెబుతారు అనేది కూడా జాబితాలో తెలిపారు. తెలుగు కామెంటేటర్ జాబితాలో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌‌కి చోటిచ్చింది. అలానే మరో మాజీ చీఫ్ సెలక్టర్ క్రిస్ శ్రీకాంత్‌ కూడా తమిళంలో కామెంట్రీ చెప్పుబోతున్నాడు. అలాగే ఎం. ఆనంద్ శ్రీ కృష్ణ, ఎం. నేహా, కౌశిక్ నలన్ చక్రవర్తి, ఎం. ఆశిష్ రెడ్డి, వెంకటపతి రాజు, వై. వేణుగోపాలరావు, ఎమ్మెస్కే ప్రసాద్, డి. కళ్యాణ్ కృష్ణవీరు చెప్ప‌నున్నారు. ఈసారి మ్యాచులు నేరుగా చూసేందుకు లేదు, క‌రోనా కార‌ణంగా కేవ‌లం ఎవ‌రికి ఎంట్రీ లేదు, అందుకే టీవీల్లో వ్యూవ‌ర్ షిప్ భారీగా పెర‌గ‌నుంది.