నల్ల కుక్క ఇంటి ముందు అరిస్తే ఏం జరుగుతుంది?

నల్ల కుక్క ఇంటి ముందు అరిస్తే ఏం జరుగుతుంది?

0
407

మనలో చాలా మంది కుక్క ఎదురు వస్తే వద్దు వెళ్లద్దు అంటారు.. కాని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుక్క ఎదురు వస్తే శుభం అంటారు.. ఒక్కో ఆచారం ఒక్కో పద్దతి ప్రాంతం బట్టీ మారుతూ ఉంటాయి. ఇక కుక్కలు మన దగ్గరకు వచ్చి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తే కొన్ని సూచనలు తెలిపినట్లు అంటున్నారు.

మరి అవి ఏమిటో చూద్దాం, మన ముందు నల్ల కుక్క వచ్చి అరిస్తే మనకు ఏదో ప్రమాదం జరుగుతుంది అని అర్దం, ఇక ఇంటి ముందు కుక్క వచ్చి అరుస్తూ ఉంది అంటే ఇంటిలో ఏదో చెడు శక్తి ఉంది అని ఎవరికో ప్రమాదం జరుగుతుంది అని సూచనగా చెబుతారు.

బయటకు వెళుతున్న వ్యక్తికీ మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనపడితే ఆ వ్యక్తికీ కష్టం కలుగుతుందని అర్ధం . కుక్కకి ఆహారం పెట్టినా అది తినకపోతే మన ఇంట చెడు శక్తి ఉంది అని నమ్మాలి, అలాగే పిల్లల దగ్గర కుక్కలు గట్టిగా అరిస్తే వారికి జ్వరం కాని ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెబుతారు.