ఆ అమ్మాయితో హీరో తరుణ్ పెళ్లి ? నిజమేనా

ఆ అమ్మాయితో హీరో తరుణ్ పెళ్లి ? నిజమేనా

0
87

లవ్ ఓరియెంటెడ్ చిత్రాలు అంటే కేరాఫ్ అడ్రస్ తరుణ్ అనే వారు అందరూ, ఇప్పుడు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు కాని తరుణ్ నటించిన సినిమాలు అన్నీ ఇప్పుడు టీవీలో వస్తూ ఉంటే అబ్బా ఏం సినిమాలు అని అంటారు అందరూ, ఇప్పటికీ అమ్మాయిలకు రాకుమారుడు తరుణ్.

అయితే ఆయన సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ఫీలింగ్ ఆయన అభిమానులు అందరికి ఉంటుంది.. లేడీ ఫ్యాన్స్ యూత్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు తరుణ్ కి …అయితే యూత్ లో బాగా పాపులర్ అయిన ఈ స్టార్ హీరో ఇంకా వివాహం కూడా చేసుకోలేదు.

ఇక రెస్టారెంట్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు తరుణ్, అయితే ఆయన తల్లి రోజారమణి ప్రముఖ నటి అనే విషయం తెలిసిందే, అయితే తాజాగా తరుణ్ కి ఓ మ్యాచ్ చూశారట, ఆమె రోజారమణి స్నేహితురాలి కూతురేనట, ఆమెకి కూడా తరుణ్ అంటే ఇష్టం, అందుకే వీరిద్దరికి పెళ్లి చేయాలి అని చూస్తున్నారట, టాలీవుడ్ లో ఈ వార్తలు వినిపిస్తున్నాయి, ఇక ఆమె ఫారెన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చిందట, హైదరాబాద్ కు చెందిన వారి కుటుంబం అని వార్తలు వినిపిస్తున్నాయి, మరి దీనిపై తరుణ్ కుటుంబం ఎలాంటి ప్రకటన చేయలేదు.