భారత్ లో మొబైల్ నెట్ వర్క్ లో జియో సంచనాలు తెలిసినవే, అనేక టారీఫ్ లు తీసుకువచ్చింది.. ప్రీమియం టారీఫ్ లు అందరికి అందుబాటు ధరల్లో తీసుకువచ్చింది, అయితే తాజాగా రిలయన్స్ ఈ లాక్ డౌన్ సమయంలో బేసిక్ ఫోన్ల కంటే అందరూ స్మార్ట్ ఫోన్లు వాడటంతో వీటిపై ఫోకస్ చేస్తుందట.
అయితే ఆన్ లైన్ క్లాసులు స్టడీస్ కు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, మనదేశంలో అతి ఎక్కువ మంది ఖరీదైన ఫోన్లు కొనలేక పోతున్నారు, అందుకే వీటిపై ఫోకస్ చేస్తోంది జియో..
ముఖేశ్ అంబానీ కొత్తగా జియో స్మార్ట్ఫోన్ పై ఫోకస్ చేశారు.
రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్ఫోన్లను దేశీయంగా తయారు చేయించాలని ఆయన నిర్ణయించినట్లు తెలిసింది. 50 కోట్ల మంది అర చేతుల్లో జియో స్మార్ట్ఫోన్ ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మన దేశంలో ఇప్పటికీ చాలా మంది దగ్గర బేసిక్ ఫోన్లే ఉంటున్నాయి, అయితే చౌకయిన స్మార్ట్ ఫోన్లు తీసుకురావాలి అని చూస్తున్నారు. ఇక త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.