ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 22న మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. తాజాగా పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులతో టెలికాన్ఫ్ రెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు తమ నియోజకవర్గాల్లో జరిగిన అవకతవకలు చంద్రబాబుకు వివరించారు. దీనిపై అధినేత స్పందిస్తూ తన పోరాటం ఈ అవకతవకలపైనే అంటు బదులిచ్చారు. ఆ తర్వాత ఈ నెల 22న అమరావతిలో జరుగబోయే సమావేశాల్లో 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, అలాగే 25 మంది పార్లమెంట్ అభ్యర్థులు హాజరు కావాలని పిలుపునించారు.
ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఆ మరుసటి రోజు అంటే 23వ తేదీ నుంచి ఇతర రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల నిమిత్తం చంద్రబాబు నాయుడు ప్రచార సభలకు హాజరు కానున్నారు.