చంద్ర‌బాబు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం షాక్ లో వైసీపీ

చంద్ర‌బాబు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం షాక్ లో వైసీపీ

0
114

ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల అవ్వడానికి ఇంకా నెల రోజులు పైనే స‌మ‌యం ఉంది…. ఈక్ర‌మంలో అధికార నాయ‌కులు మ‌రోసారి త‌మ‌దే విజ‌యం అని అంటుంటే ప్ర‌తిప‌క్షాలు బైబై బాబు అధికారం వైసీపీదే అని అంటున్నారు. అయితే బ‌య‌టికి మాత్రం ఈ రెండు పార్టీలు ఎంత ప్ర‌చారం చేసున్న‌ప్ప‌టికీ లోలోప‌ల మాత్రం గుబులు ప‌డుతున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

అయితే ఈక్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 175 నియోజ‌క‌వ‌ర్గ‌ల టీడీపీ అభ్య‌ర్థులంద‌రు త‌మ‌ను క‌ల‌వాల‌ని సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రు విజ‌య‌వ‌కాశాల‌పై రిపోర్ట్ తేవాల‌ని ఎవ‌రైనా మోసం చేస్తే వారి వివ‌రాలు అందివ్వాల‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మండ‌ల స్థాయినుంచి గ్రామ స్థాయివ‌ర‌కు టీడీపీ అభ్య‌ర్థుల‌కు అనుకూలంగా ఉన్న పార్టీల‌తో రిపోర్ట్ త‌యారు చేయించుకోవాల‌ని అంటున్నారు.

అంతేకాదు మండ‌ల గ్రామ స్థాయిలో పోలీంగ్ బూత్ లు, ఎన్నిఓట్లు పోలైనాయి… పోలింగ్ స‌ర‌ళి ఎలా సాగింది, పార్టీకి స‌హ‌క‌రించిన వారు ఎవ‌రు స‌హ‌క‌రించ‌ని వారు ఎవ‌రు, బాలాలు బ‌ల‌హీన‌త‌లు త‌దిత‌ర అంశాల‌పై త‌న‌కు నివేదిక కావ‌ల‌ని చంద్ర‌బాబు నాయుడు ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.