ఈ సారి ఐపీఎల్ సీజన్లో ఆటగాళ్లకి బాగా గాయాలు వేధిస్తున్నాయి, ఏకంగా టోర్నీ నుంచి కొందరు నిష్క్రమిస్తున్నారు, దీంతో వారి అభిమానులు ఢీలా పడుతున్నారు, ఇప్పటికే ఎస్‌ఆర్‌హెచ్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు మిచెల్ మార్ష్, ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా టోర్నీ నుంచి వైదొలగగా, ఇప్పుడు మరో బౌలర్ దూరం అవుతున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ లీగ్‌కు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో కేవలం ఒక గేమ్ మాత్రమే ఆడిన ఇషాంత్.. గాయం కారణంగా లీగ్ కు దూరం అయ్యాడు. అతని పక్కటెముకలు గాయం వేధిస్తుండటంతో టోర్నీకి దూరమవుతున్నట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ తెలిపింది.
ఈ నెల 7వ తేదీన ట్రైనింగ్ సెషన్‌లో ఇషాంత్ ఎడమవైపు పక్కటెముకలు నొప్పి ఎక్కువైంది, దీంతో అతనికి ఆ పెయిన్ తగ్గలేదు, ఇక కొన్ని వారాలు రెస్ట్ అవసరం అన్నారు వైద్యులు, దీంతో అతను టోర్నీకి గుడ్ బై చెప్పాడు… లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇషాంత్ శర్మ దూరం కావడం ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ. అయితే విజయాలు మాత్రం కచ్చితంగా సాధిస్తుంది అంటున్నారు ఢిల్లీ అభిమానులు.