ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తున్న జట్లు అంటే ముందు వినిపించే పేరు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు.. విజయాల పరంపర కొనసాగుతోంది, అయితే ఇప్పటివరకు కెప్టెన్ గా వ్యవహరించిన వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే అతను నిర్ణయం తీసుకోవడం వెనుక స్ట్రాటజీ ఉంది.
తను బ్యాటింగ్ పై మరింత ఫోకస్ చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే కెప్టెన్ గా ఎవరు అనేది చూస్తే,
అతడి స్థానంలో ఇయాన్ మోర్గాన్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్టు కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. కొత్త కెప్టెన్ గా నియమితుడైన మోర్గాన్ కు కార్తీక్ శుభాకాంక్షలు తెలిపాడు.
మొత్తానికి టీమ్ విజయాల కోసం ఈ నిర్ణయం తీసుకోవడంతో యాజమాన్యం కూడా దీనిని స్వాగతించింది.
2019 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కెప్టెన్ అయిన ఇయాన్ మోర్గాన్ వంటి ఆటగాడు కెప్టెన్ గాఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు యాజమాన్యం చెప్పింది.. ఇప్పటివరకు కోల్ కతా వైస్ కెప్టెన్ గా ఉన్న ఇయాన్ మోర్గాన్ ఇకపై పూర్తిస్థాయి కెప్టెన్ గా ఉంటారు.