శుక్రవారం అబుదాబిలో కోల్కతాపై ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది, అదరగొట్టారు ముంబై ఆటగాళ్లు,
ముంబై ఓపెనర్ క్లింటన్ డికాక్ దంచికొట్టాడు. సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడి తమ జట్టును గెలుపుకి తీసుకువెళ్లాడు, అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ లో జరిగిన ఓ ఫన్నీ సంఘటన అందరికి నవ్వు తెప్పిస్తోంది.
క్లింటన్ డికాక్ కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఐతే ఈ మ్యాచ్లో ముంబై ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు క్వింటన్ డికాక్ మైదానంలోకి దిగాలనే కంగారులో ప్యాంట్ మార్చుకోవడం మరిచిపోయాడు. ముంబై ఇండియన్స్ ప్యాంట్కు బదులు ట్రైనింగ్ ప్యాంట్తోనే గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు.
అయితే ఇది ఎవరూ అంతగా గుర్తించలేదు, కానీ ఈలోగా రోహిత్ తో కలిసి ముందుకు అడుగులు వేస్తున్నాడు.
అయితే అతడి ప్యాంట్ వెనక భాగం ఆరెంజ్ రంగులో ఉండడంతో ఇతర ముంబై ఆటగాళ్లు గుర్తించి.. ఈ విషయాన్ని డికాక్కు చెప్పారు. కంగారుపడిన డికాక్.. ప్యాంట్ మార్చుకునేందుకు డగౌట్ వైపు పరుగులు తీశాడు. ఐతే రోహిత్ శర్మ అతడిని ఆపి.. ఆరెంజ్ కలర్ కనిపించకుండా కవర్ చేయమని చెప్పాడు, అతను అలా మ్యాచ్ ఆడాడు ఈ సన్నివేశం చూసి మిగిలిన ఆటగాళ్లు సో ఫన్నీ అని సరదగా నవ్వుకున్నారు, రోహిత్ కూడా సరదా నవ్వులు నవ్వాడు.
మరి ఆ వీడియో మీరు చూడండి లింక్ ఇదే
— Simran (@CowCorner9) October 17, 2020