ఈ ఐపీఎల్ సీజన్లో ఆటగాళ్లు అదరగొడుతున్నారు, టీమ్ లు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి, ఈసారి మ్యాచ్ల ఫలితాలు సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్లు సూపర్ ఓవర్లకు వెళితే, ఆదివారం జరిగిన కింగ్స్ పంజాబ్- ముంబై ఇండియన్స్ అందుకు భిన్నం. ఈ మ్యాచ్లో రెండో సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది.
చివరకు కింగ్స్ పంజాబ్ విజేతగా నిలిచింది. , ఐపీఎల్ చరిత్రలో రెండు సూపర్ ఓవర్ల ద్వారా మ్యాచ్ ఫలితం తేలడం ఇదే తొలిసారి. సెమీస్,ఫైనల్నాకౌట్ మ్యాచ్ల్లోఫలితం తేలేవరకు మళ్లీ మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహించాలనే రూల్ తీసుకొచ్చింది ఐసీసీ. ఇదే నిబంధనను ఐపీఎల్లో అమలు చేశారు.
అయితే రెండో సూపర్ ఓవర్ టై అయితే ఏమి అవుతుంది మరి ఏం చేస్తారు అనేది చూద్దాం..
ఇక్కడ మ్యాచ్ సమయాన్ని చూస్తారు, అలాగే ఇరుజట్ల కెప్టెన్ల ఒప్పందం ప్రకారం చెరొక పాయింట్ కేటాయిస్తారు. ఇక మూడో సూపర్ ఓవర్ ఉండదు. చెరో ఓ పాయింట్ తీసుకోవాల్సిందే.
బౌండరీ కౌంట్ రూల్ అమలు చేయరు.
సమయం ఎలా చూస్తారు అంటే
మధ్యాహ్న మ్యాచ్లు సూపర్ ఓవర్కు వెళితే రాత్రి గం.8గంటలకు ప్రారంభిచకూడదు. అదే సమయంలో రాత్రి మ్యాచ్లకు సూపర్ ఓవర్కు వెళితే అది అర్థరాత్రి 12గంటలు దాటకూడదు అని రూల్ ఉంది. ఈలోపు సూపర్ ఓవర్ అవ్వాలి.