సచిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చాలా డిఫరెంట్ గా చెప్పిన రామ్

సచిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చాలా డిఫరెంట్ గా చెప్పిన రామ్

0
96

అందరూ చేసే పని నువ్వు చేస్తే కాపీ అంటారు కొత్తగా చేస్తే క్రియేటివిటీ అంటారు. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న అనేక సంఘటనలకు లింక్ చేస్తూ నువ్వు సొసైటీకీ ఏదైనా చెబితే జనాలకు తెలుస్తుంది అది ఆలోచింప చేస్తుంది. తాజాగా హీరో రామ్ అదే చేశారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో పాస్ అవలేదు అని దాదాపు 16 మంది విద్యార్దులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశం పెద్ద చర్చకు వస్తోంది. సినీ ప్రముఖులు సైతం విద్యార్థుల్లో ధైర్యం నూరిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు. యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పటికే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల గురించి ట్విటర్లో స్పందించిన సంగతి తెలిసిందే. ఎవరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు అని కోరారు. తాజాగా మరో ట్వీట్ ఆలోచింప చేసే విధంగా చేశారు.

పార్క్లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. బెడ్రూమ్ లాక్ వేసుకుని లైఫ్ ఎలా అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు… ఇంటర్ కూడా పూర్తి చేయని.. జాతి గర్వించే ఆటగాడు సచిన్ టెండూల్కర్గారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అని రామ్ ట్వీట్ చేశాడు.మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఇంటర్ పాస్ అవలేదనే విషయాన్ని రామ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.