జగన్ కు చుక్కలు చూపించనున్న బాబు

జగన్ కు చుక్కలు చూపించనున్న బాబు

0
49

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా పెద్ద నష్టం లేదు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎందుకు అంటే తమ వారసుడు లోకేష్ ఈ ఐదు సంవత్సరాల్లో మరింత రాజకీయంగా చురుకుగా మారతాడు అని చెబుతున్నారు ..అయితే జగన్ కూడా 2014 నుంచి 2019 వరకూ రాజకీయంగా చూసుకుంటే అనేక మార్పులు తెచ్చుకున్నారు. ఏపీలో జగన్ కంటే బాబుకు మీడియా పరంగా మంచి సపోర్ట్ ఉంది. అధికారంలో ఉన్న సమయంలోనే ఇంత సపోర్ట్ ఉంటే, ఇక జగన్ సీఎం అయి బాబు ప్రతిపక్షంలో ఉంటే ఎలాంటి పరిస్దితి జగన్ కు ఉంటుందో ఒకసారి ఆలోచించాలి అంటున్నారు. ముఖ్యంగా జగన్ కు మీడియా పరంగా బాబు చుక్కలు చూపిస్తారు అని చెబుతున్నారు.

కాని జగన్ పగటి కలలు కంటున్నాడని, ఇప్పుడు ఏపీ ప్రజలు మళ్లీ అనుభవానికి పట్టం కడతారు అని చెబుతున్నారు ప్రజలు. అయితే తెలుగుదేశం పార్టీ కూడా తాము గెలుస్తాం అని ధీమాగా ఉంది. మరో పక్క జగన్ కు, వైసీపీకి జాతీయ మీడియాల నుంచి వస్తున్న సర్వేలు మాత్రమే జీవం పోస్తున్నాయి అని అంటున్నారు. 2014లో ఇలానే అన్నారు వాస్తవాలు వేరుగా ఉంటున్నాయి ఫలితాలలో అని టెన్షన్ పడుతున్నారట జగన్. అందుకే జగన్ సీఎం అయినా సరే బాబు చుక్కలు చూపిస్తారు అంటున్నారు మేధావి వర్గం.