జగన్ మంచివాడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన స్టేట్ మెంట్

జగన్ మంచివాడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన స్టేట్ మెంట్

0
36

జగన్ పేరు చెబితే తెలుగుదేశం పార్టీ నాయకుల నోటి నుంచి వచ్చే మాట జగన్ లక్ష కోట్లు అవినీతి చేశాడు అంటారు.. జగన్ పై ఉన్న చార్జీ షీట్ల విలువ అంత లేదు అన్నా సరే, లెక్కలు రాని నేతలు ఎందరు ఉన్నారో తెలియదు కాని ,అందరూ అదే విమర్శ చేస్తారు.. ఇక వారు ఏమీ చెప్పినా జనాలు వెర్రి వారుగా నమ్ముతారు అనే ఆలోచనలోఈ నేతలు ఉంటారు అనేది చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ నేతలకు ఓ షాక్ ఇచ్చారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఇది ఎన్నికలకు ముందు ఇచ్చి ఉంటే బాగుండేది అని అంటున్నారు వైసీపీ నేతలు… మరి ఇంతకీ ఏమిటి అని అనుకుంటున్నారా తెలుసుకుందాం.

తాజాగా జనసేన నుంచి విశాఖ పార్లమెంట్ కు పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగన్ పై పలు కామెంట్లు చేశారు. జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడలేదని ఇదంతా అబద్దపు ప్రచారం ఆరోపణలు అని అన్నారు. జగన్ లక్షకోట్ల దోపిడీ ఆరోపణలన్నీ రాజకీయ ఆరోపణలేనని, తాను పరిశోధించిన కేసుల ప్రకారం 1500 కోట్లు మేరకు మాత్రమే అవకతవకలు జరిగినట్లు గుర్తించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ తెలియచేశారు. తాను తన ఉద్యోగం ప్రకారం వర్క్ చేశాను అని ఆయన అన్నారు. నాపై ఎవరి ఒత్తిడి లేదు అని తెలియచేశారు..దీంతో జగన్ పై లక్ష కోట్లు అనే విమర్శలకు ఆయనే ఫుల్ స్టాప్ పెట్టారు అని అంటున్నారు వైసీపీ నేతలు.