రజనీకాంత్ వెబ్ సైట్ ఇండియాలో ఫస్ట్

రజనీకాంత్ వెబ్ సైట్ ఇండియాలో ఫస్ట్

0
100

రజనీకాంత్ తమిళ తలైవా, సౌత్ ఇండియా సూపర్ స్టార్ ఇక సినిమాలతో బీజీగా ఉన్న రజనీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నాను అని గత ఏడాది ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అనుకుంటే ఆయన పోటీ చేయలేదు. తాను 2021 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటాను అని తెలియచేశారు. అప్పటి వరకూ రజనీ పార్టీ కోసం ఆయన అభిమానులు చూడాల్సిందే. అయితే ఇప్పుడు తమిళ నాడులో ఓటు వేసిన అభిమానులు తదుపరి తమ ఓటు రజీనీకాంత్ కే అంటూ చెబుతున్నారు.

రజనీ అభిమానులు కొత్తగా ఆలోచించి హెస్టేక్ వెబ్సైట్ను ప్రారంభించారు. అది ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. రాత్రి వరకూ ఈ హెస్టేక్ వెబ్సైట్ ఇండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అందులో ఈ సారి ఓటు వేశాం. తదుపరి ఓటు కచ్చితంగా రజనీకాంత్కే అంటూ ఆయన అభిమానులు ఆ వెబ్సైట్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ అనూహ్యంగా ఇండియా స్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడం వారిని ఆనందంలో ముంచెత్తింది. దీంతో రజనీ ఫాలోయింగ్ చూసి అభిమానులు పవర్ చూసి తమిళ నేతలు అప్పుడే గగ్గోలు పెడుతున్నారు.