గెలిచిన సమయంలో ప్రశంసలు చేయడం ఓడిన సమయంలో విమర్శలు చేయడం ఎక్కడైనా జరుగుతుంది, ఇది ఒక్క క్రీడల్లోనే కాదు అన్నీంటిలో జరుగుతుంది, ఇప్పుడు సీఎస్కేపై కూడా క్రీడాలోకం ఇలాంటి మాటలే అంటోంది, అయితే చెన్నై అభిమానులు మాత్రం ఇలాంటివి పట్టించుకోవడం లేదు, ఇక ధోనీ అభిమానులు వీటిని లైట్ తీసుకుంటున్నారు, ఏకంగా వచ్చే సీజన్ కు ధోనీ కెప్టెన్ గా ఉండరు అనేంతగా పుకార్లు వస్తున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్‌కు దూరమైంది. కెప్టెన్ ధోనీతో పాటు ఇతర ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శనే దీనికి కారణం. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే ధోనీ ఎన్ని విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు
తాజాగా సీఎస్కే సీఈవో స్వామినాథన్ ఓ తీపి కబురందించారు.
ధోనీపై ఇలా కామెంట్లు వస్తున్న వేళ, 2021లో కూడా ధోనీయే చెన్నై జట్టు కెప్టెన్‌గా ఉంటారని ఆయన ప్రకటించారు. అయితే జట్టు ఓటమికి సురేశ్ రైనా, హర్భజన్ లేకపోవడం, కోవిడ్ కేసులు వెంటాడటం వంటి ప్రతికూల పరిస్థితులే కారణమని ఆయనన్నారు. సో ఆయన చేసిన కామెంట్ తో ధోనీ ఫ్యాన్స్ ఖుషీగాఉన్నారు.