ఐపీఎల్ 2021 కొత్త ఫ్రాంచైజీతో మోహన్ లాల్ ఎంట్రీ – పార్టనర్ ఎవరంటే

ఐపీఎల్ 2021 కొత్త ఫ్రాంచైజీతో మోహన్ లాల్ ఎంట్రీ - పార్టనర్ ఎవరంటే

0
100

ఐపీఎల్ 2020 ముగిసింది ఇక వచ్చే ఏడాది 2021 ఐపీఎల్ కోసం టీమ్ లు ప్రాంచైజీలు సిద్దం అవుతున్నాయి, బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది, అయితే మరో ఐదునెలల్లో క్రీడా అభిమానులని మరోసారి ఐపీఎల్ అలరించనుంది, ఇక షెడ్యూల్ లేట్ అవ్వడంతో మరో ఐదు నెలల్లో ఐపీఎల్ స్టార్ట్ చేస్తారు.. సౌరవ్ గంగూలీ ఇటీవల ఈ విషయాన్ని చెప్పారు.

బోర్డు ఐపీఎల్ వేలం కోసం రెడీ అవుతోంది.ఈసారి తొమ్మిదో ఫ్రాంచైజీ కూడా వేలంలో పాల్గొనబోతున్నట్టు ఫ్రాంచైజీలకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ప్రతీ ఏడాది డిసెంబరులో వేలం జరుగుతుంది.. ఈసారి జనవరిలో జరిగే అవకాశం ఉంది, ఇక అహ్మదాబాద్ కేంద్రంగా ఈ ఫ్రాంచైజీ రాబోతోంది, మరో మాట ఏమిటి అంటే కేరళ టీమ్ అని మరో వార్త వినిపిస్తోంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ బైజూస్తో కలిసి బిడ్ వేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి, అయితే అహ్మదాబాద్ బేస్ గా వస్తుందా లేదా కేరళ పేరుతో వస్తుందా అనేది చూడాలి, మరి ఈసారి ఎవరు ఎవరి టీమ్ నుంచి వస్తారో. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది.