మృత సముద్రం గురించి మీకు ఈ విషయాలు తెలుసా

మృత సముద్రం గురించి మీకు ఈ విషయాలు తెలుసా

0
137

మృత సముద్రం ఈ మాట చాలా సార్లు మీరు వినే ఉంటారు, దీనిని ఉప్పు సముద్రం అంటారు, అయితే దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..ఇజ్రాయేల్, జోర్డాన్ దేశాల మధ్యన ఇది ఉప్పునీటి సరస్సుగా ఉంది..మృత సముద్రం 380 మీటర్ల లోతున ఉంది, ప్రపంచంలో అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సుగా ఇది ప్రసిద్ది.

సముద్రమట్టానికి 420 మీటర్ల దిగువన ఉంది.. 33.7% శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత్యంత ఉప్పుగా ఉండే జలాశయాలలో ఇది ఒకటి. అస్సల్ సరస్సు , గరబొగజ్కోల్, అంటార్కిటికాలోని మెక్ముర్డో పొడి లోయలలోని లవణీయత ఎక్కువైన డాన్ హువాన్ కుంట వంటి కొన్ని సరస్సులు మాత్రమే మృతసముద్రం కంటే ఉప్పుగా ఉన్నాయి.

అత్యంత లవణీయత కలిగిన సరస్సు, వాండా సరస్సు సముద్రం కంటే 8.6 రెట్లు అధిక లవణీయత కలిగి ఉంది. ఈ నీరు నోటిలో వేసుకుంటే పది కేజీల ఉప్పు వేసుకున్నట్టే.. అందుకే ఇక్కడ మొక్కలు జంతువులు ఏమీ పెరగవు.. మృత సముద్రం 67 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.. మృత సముద్రం నుండి లభ్యమయ్యే లవణాలు, ఖనిజాలు సౌందర్యసాధనాలు తయారుచేయటానికి ప్రజలు ఉపయోగించేవారు గతంలో.