వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే పోలింగ్ పూర్తి అయింది అని రిలాక్స్ మూడ్ కు వెళ్లారు.. తమ కుటుంబంతో కలిసి ఆయన ఫారెన్ ట్రిప్ స్విట్జర్లాండ్ కు వెళ్లారు.. అయితే ఇటు మా అధినేత చంద్రబాబు జగన్ కంటే ఎక్కువగా కష్టపడ్డారు అని ఆ వయసులో కూడా రోజుకు ఆరు నుంచి ఏడు సభలు నిర్వహించి పాల్గొన్నారు అని తెలుగుదేశంనేతలు చెప్పారు.. ఈ సమయంలో బాబు కూడా మూడవ విడత ఎన్నికలు ముగియడంతో ఆయన కూడా కాస్త రిలాక్స్ అవ్వాలి అని కుటుంబంతో సరదగా కొంత సమయం గడపాలి అని డిసైడ్ అయ్యారు.
అయితే కాస్త విశ్రాంతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు నేడు కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తదితరులు ఈ ప్రయాణానికి వెళ్లనున్నారని పార్టీ శ్రేణులు వెల్లడించారు. అయితే తిరిగి సోమవారం నాడు చంద్రబాబు అమరావతి చేరుకోనున్నారు. ఇటు బాబుగారి ప్రయాణం గురించి పార్టీ అభిమానులకు తెలియడంతో, ఏపీకి మళ్లీ మీరే సీఎం కచ్చితంగా కుటుంబంతో బాగా ఎంజాయ్ చేయండి అని చెబుతున్నారు టీడీపీ నేతలు.