టీడీపీ నేతలపై టార్గెట్ పెట్టిన జగన్

టీడీపీ నేతలపై టార్గెట్ పెట్టిన జగన్

0
58

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం తెలిసిందే …పార్టీ తరపున వారికి నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది ..అయితే ఈసారి పవన్ నుంచి కూడా పోటీ రావడంతో మెజార్టీ చాలా స్దానాల్లో తగ్గుతుంది అని తెలుసుకున్నారు.. ఇటు ఇరు పార్టీల నాయకులు ముఖ్యంగా జగన్ అందుకే మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ తరపున కొందరు నేతలను వైసీపీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారట.. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతున్న అంశం. గత ఎన్నికల్లో వారిని వైసీపీలో చేరాలి అని కోరినా వారు రాలేదు.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే అవకాశం తమకు వస్తే తమకు సపోర్ట్ గా ఉండాలి అని వైసీపీ నేతలు కోరుతున్నారట. ఇది తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.

వల్లభనేని వంశీ, బీసీ జనార్దన రెడ్డి, అనగాని సత్యప్రసాద్ వంటి వారిపై హైదరాబాద్లో ఉన్న ఆస్తులు బూచిగా చూపి, ఒత్తిడి తెచ్చి వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతే కాదు.. వీరిని ఎన్నికల ముందు కూడా వైసీపీలోకి లాగేందుకు ప్రయత్నించారట. కానీ వారు లొంగలేదట. ఇప్పుడు హైదరాబాద్ లో వారి ఆస్తులు వ్యాపారాలు టార్గెట్ చేసి పార్టీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారట.. కాని వారు ఎట్టి పరిస్దితుల్లో తమకు మంత్రి పదవి ఇస్తాము అని హామీ ఇచ్చినా పార్టీ మారము అని చెబుతున్నారు ఈ నేతలు.