పులివెందులలో జగన్ కోసం కొత్త ఏర్పాట్లు

పులివెందులలో జగన్ కోసం కొత్త ఏర్పాట్లు

0
64

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి కాబోయే సీఎం అని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎలాంటి సర్వేలు చూసినా జగన్ సీఎం అని చెబుతున్నాయి.. ఈ సమయంలో ఎన్నికల ఫలితాలు కూడా జగన్ సీఎం అని చెబుతున్నాయి.. ఈ సమయంలో జగన్ కు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున పాజిటీవ్ గా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా జగన్ సీఎం అంటూ ఓ నేమ్ ప్లేట్ కనిపించడం తెలిసిందే.. ఇలా జగన్ టీం కావాలనే జగన్ పేరుతో ఉన్న ప్లేట్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది అని తెలుగుదేశం నేతలు విమర్శలు చేశారు.. ఇక వారు కలలు కంటున్నారు అని టీడీపీ విమర్శలు చేసింది. అంతేకాదు మంత్రి వర్గ కూర్పు కూడా జగన్ చేసుకుంటున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓపోస్టుని చూపించి ఇదే ఆ లిస్ట్ అని వైరల్ చేశారు టీడీపీ నేతలు.

తాజాగా మరో ప్రచారం కూడా చేశారు. జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో జగన్ రాజకీయంగా పైకి వచ్చారు. అయితే సీఎం అయిన తర్వాత జగన్ రాజధాని కూడా పులివెందులలో ఏర్పాటు చేయనున్నారు అని కొత్త వార్త ప్రచారం చేశారు.. జగన్ అనేక ఇంటర్వ్యూలలో రాజధాని మార్పు ఉండదు అని చెప్పారు… మళ్లీ పదే పదే అదే విమర్శ చేస్తున్నారు.. ఇక మరి ఈసారి తమ విషప్రచారం మరింత పెంచారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట.. ఆయన పులివెందులలో ఇడుపుల పాయ దగ్గర భారీ ఖాళీస్దలంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.. అక్కడ ఖాళీ ప్రాంతం చదునుచేస్తున్నారు అని తెలుగుదేశం నేతలు వైరల్ చేస్తున్నారు.. చివరకు ఇది వాస్తవం కాదు అని మీడియా చెప్పినా ఇది నిజం అని ఎల్లో మీడియా వార్తలు ప్రచారం చేస్తోంది.