చేతిపై కాటు వేసిన పాము దాని పన్ను విరిగింది చివరకు ఏమైందంటే

-

పాము ఎంతో విషపూరితమైనది, ఇది కాటేసింది అంటే వెంటనే యాంటీ డోస్ తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం.. అందుకే అతి జాగ్రత్తగా ఉంటారు రైతులు.. ఇక తుప్పలు తడి ప్రాంతాలు గోనె సంచులు అలాగ మొక్కల దగ్గర ఈ నాగులు తాచులు ఉంటాయి, అయితే పాములు పట్టే వారు చాలా మంది వాటికి ఎలాంటి హాని లేకుండా పట్టుకుని అడవుల్లో వదిలేస్తారు.

- Advertisement -

తాజాగా విశాఖలోని ఓ ఇంట్లో పాము రావడంతో కుటుంబ సభ్యులు పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. దీంతో అతను వచ్చి పామును బంధించాడు. ఆ పామును గోనె సంచిలో వేస్తుండగా.. పాము తల తీసి ఒక్కసారిగా అతని చేతిపై కాటు వేసింది.
ఈ సమయంలో చీకటి ఉండటంతో అతను గమనించలేదు.

సంచికి తాడు కడుతుండగా చేతిపై కాటు వేసింది. వెంటనే కేజీహెచ్కు వెళ్లగా వైద్యులు పరిశీలించారు. చేతిపై పాము పన్ను దిగి విరిగిపోయినట్లు గుర్తించి దానిని తొలగించారు. అయితే అతనికి ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదు అని తెలిపారు. సో పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...