మన దేశంలో క్రికెట్ లో కేరళ ఎక్స్‌ప్రెస్ అంటే టక్కున గుర్తు వచ్చే పేరు శ్రీశాంత్ , అయితే కొన్ని ఏళ్లుగా క్రికెట్ కు దూరంగా ఉన్న శ్రీశాంత్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు, తన బంతులు వేగాన్ని చూపించనున్నాడు.కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో శ్రీశాంత్ ఆడనున్నారు.
ఏడేళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడుతున్నానని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశాంత్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తంచేశాడు. ఇక శ్రీకి అందరూ విషెస్ తెలియచేస్తున్నారు, మంచి భవిష్యత్తు ఉంది ఆడు అంటున్నారు అతని అభిమానులు.
గతంలో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2013 ఐపీఎల్‌లో అతని ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరొపణలు వచ్చాయి. అతనిపై ఇటీవల బ్యాన్ ముగిసింది, ఇక అతని అభిమానులకి ఇది పండుగే అని చెప్పాలి , వచ్చే నెల నుంచి 17 న టోర్నీ స్టార్ట్ అవుతుంది.