క్రికెట్ లో యూనివర్స్ బాస్ అంటే ఠక్కున చెబుతాం వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అని.. అయితే అతని సహ ఆటగాళ్లు కొందరు రిటైర్మెంట్ ప్రకటించినా గేల్ మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నాడు.. అయితే అతని రిటైర్మెంట్ గురించి అనేక వార్తలు వినిపించాయి.. కాని ఏనాడు వాటిని పెద్ద పట్టించుకోలేదు.
తాజాగా క్రిస్ గేల్ తన భవిష్యత్ ప్రణాళికలను మీడియాతో పంచుకున్నాడు… 41 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు క్రికెట్… ఇక తాను ఇప్పుడు రిటైర్మెట్ ప్రకటించడం లేదు అని ఇంకా రెండు వరల్డ్ కప్ లు ఆడతా అని ధీమాగా చెబుతున్నాడు…ఫిట్ నెస్ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నాడు.
ఈ ఏడాది భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ లోనే కాదు, 2022లో ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలోనూ ఆడతానని వివరించాడు. తన ఫిట్ నెస్ బట్టీ మరో ఐదు సంవత్సరాలు ఆడగలను అని నమ్మకం ఉందని చెబుతున్నాడు.