టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు, ఐపీఎల్ చెన్నై తరపున కొనసాగుతున్నారు మిస్టర్ కూల్, అయితే ఇటీవల పలు వ్యాపారాలపై ఫోకస్ చేశాడు ధోనీ, ముఖ్యంగా ఇప్పుడు ఆయన చేస్తున్నసేంద్రీయ వ్యవసాయం సక్సెస్ అవుతోంది. సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న కూరగాయలు యూఏఈకి ఎగుమతి చేస్తున్నారు.. ఎలాంటి పురుగుల మందులు వాడకుండా పండిస్తున్న పంటకి మంచి డిమాండ్ వచ్చింది.
తన ఫామ్ హౌస్లో కూరగాయాలు పండించడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు. ఇప్పటికే 10 ఎకరాల్లో టమోట, క్యాబేజీతో పాటు వివిధ రకాల కూరగాయాల పంట వేశాడు, వాటిని యూఏఈకీ ఎక్స్ పోర్ట్ చేస్తున్నారట. యూఏఈలో ఇప్పుడు ధోనీ కూరగాయాలకి ఓ బ్రాండ్ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక వీటిని తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు, ధోనీ ఇంటి దగ్గర ఉంటే ఇవే కూరగాయలు అతను వాడుతున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీ లో ధోనీకి దాదాపు 50 ఎకరాల పొలం ఉంది. అందులో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాదు ఆర్గానిక్ ఫౌల్ట్రీ ఫామ్ని కూడా ప్రారంభించనున్నారు త్వరలో . మధ్యప్రదేశ్లోని భీమ్లాంచల్ ప్రాంతానికి చెందిన కడక్నాథ్ కోళ్ల పెంపకంపై ధోనీ ఫోకస్ చేశారు, దాదాపు 2000 కోడి పిల్లలను ఆర్డర్ ఇచ్చారు అని వార్తలు వినిపించాయి. ఇవి శరీరానికి చాలా మంచిది.