గోదావరి జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్

గోదావరి జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్

0
89

తెలుగుదేశం పార్టీ ఈసారి గోదావరి జిల్లాలో భారీ మెజార్టీ వస్తుంది అని చెప్పుకుంటోంది.. కాని వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున మెజార్టీ స్ధానాలు గెలుపొందడానికి ముఖ్య కారణం పవన్ కల్యాణ్ అని చెప్పాలి.. అయితే ఈసారి పవన్ కల్యాణ్ బీజేపీ ఇద్దరూ కూడా బాబుకు అండగా లేరు, పైగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ కూడా బీజేపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది. ఇలా చూసుకుని జిల్లాలో మొత్తం జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి సాధించిన సీట్లు అవి.. అయితే తెలుగుదేశం పార్టీ ఈ సారి ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్లడం లేదు.

దీంతో జనసేన వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా డేంజర్ అని ఫలితాలు రివర్స్ అవుతాయి అని అంటున్నారు విశ్లేషకులు, సర్వేలు కూడా అవే చెబుతున్నాయి, ఎందుకు అంటే గత ఎన్నికల్లో జగన్ కు పడిన ఓటు బ్యాంకు మళ్లీజగన్ కు పడుతుంది, కాని పవన్ ఓటు బ్యాంకు తెలుగుదేశం నుంచి వైసీపీ జనసేనకు మళ్లుతుంది అందువల్ల తెలుగుదేశం పార్టీ అనుకున్నన్ని స్ధానాలు గెలుచుకునే ఆస్కారం లేదు అంటున్నారు జిల్లా నేతలు. ఇక వైసీపీ కూడా తామే గెలుస్తాం అనే ధీమాతో ఉంది.