జగన్ కేబినెట్లో వీరు పక్కా

జగన్ కేబినెట్లో వీరు పక్కా

0
48

వైయస్ జగన్ గెలిస్తే సీఎం ఆయనే, ఇక మంత్రులుగా ఎవరు ఉంటారు అంటే జిల్లాకు ఇద్దరి పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు తెలియచేశారు.. వారికి పక్కాగా మంత్రి పదవులు వస్తాయి అని చెబుతున్నారు.. అయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి కాకుండా ఈసారి వైసీపీ గెలుపుపక్కా అని సర్వేలు చెబుతున్నాయి.. మరి ఈ సమయంలో వైసీపీ గెలిస్తే మంత్రులు ఎవరు అవుతారు అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.. వైసీపీలో పెద్దగా సీనియర్ నాయకులు లేకపోవడంతో ఎవరిని ఎంపిక చేయాలనేది కత్తి మీద సాములా మారిపోయిందట జగన్ కి…

అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎవరికి కట్టబెట్టానే ఆలోచనలో ఉన్నాడట జగన్. అయితే బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, ఆనం రామనారాయణ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఇలా కొద్ది మంది మాత్రమే మంత్రులుగా అనుభవం ఉంది. అయితే వారిలో ఒకరికి ఆ మంత్రి శాఖ ఇస్తారట, బుగ్గనకు ఆర్దికశాఖ ఇస్తారట, ఇక మంత్రులుగా చిత్తూరు నెల్లూరు నుంచి ఆరుగురికి అవకాశం ఇస్తారట జగన్, ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం, ఆ జాబితాలో ఎమ్మెల్యే రోజా పేరు తప్పక ఉంటుంది అని చెబుతున్నారు.