వైసీపీ నాయకులు కొందరు అత్యుత్సాహం చూపించి ఈ ఎన్నికల్లో తాము గెలుస్తాము అని చెబుతున్నారు.. అయితే తెలుగుదేశం పార్టీ నేతలపై అదే పనిగా విమర్శలు కూడా చేస్తున్నారు.. తాము కచ్చితంగా అధికారంలోకి వస్తాము అని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ విషయం చర్చకు వస్తోంది, పైగా జగన్ 120 నుంచి 130 స్ధానాల్లో గెలుస్తారు అంటూ సర్వేలు కూడా వైరల్ చేస్తున్నారు. ఇంకా జగన్ ప్రమాణ స్వీకారం పులివెందులలో జరుగుతుంది అని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెబుతున్నారు.
మొత్తానికి జగన్ పేరిట అనేక సర్వే రిపోర్టులు, పలు వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.. ఇక మంత్రులు కూడా జగన్ ఫిక్స్ చేసుకున్నారని, జిల్లాలో కొందరు జగన్ కు ఆప్తులుగా ఉన్న వారి లిస్ట్ కూడా వైరల్ అయింది.. తాజాగా కొందరు మంత్రి పదవులు ఖాయమని ఫిక్సైపోయిన నేతలు పీఏలు, పీఆర్ఓలుగా ఎవరిని పెట్టుకోవాలని సంప్రదింపులు జరుపుతున్నారట. పదవి వచ్చాక అన్నీ సమకూర్చుకోవడం కష్టమవుతుందని ఇప్పట్నుంచే సిబ్బందిని సమకూర్చుకునే పనిలో పడ్డారట. ఈ వ్యవహారం కాస్తా వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో మంత్రులుగా ప్రచారం చేసుకుంటున్న వారిని, పార్టీ సీనియర్లను లోటస్పాండ్కు పిలిపించి క్లాస్ తీసుకున్నారట. ఓ ముగ్గురు నేతలకు జగన్ క్లాస్ తీసుకున్నారు అనే వార్త పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.