జగన్ తో అమిత్ షా భేటీ ముహూర్తం ఫిక్స్

జగన్ తో అమిత్ షా భేటీ ముహూర్తం ఫిక్స్

0
48

వైసీపీ అధినేత జగన్ తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కానున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. దీని వెనుక బలమైన కారణం ఉంది.. ఏపీలో అన్నీ సర్వేలు జగన్ కు పాజిటీవ్ గా రిజల్ట్ ఇస్తున్నాయి. అయితే బీజేపీ కూడా ఏపీపై సర్వే చేయించింది అని తెలుస్తోంది.. ఈ సమయంలో జగన్ 110 నుంచి 115 స్ధానాలు గెలుచుకుంటారని, అలాగే 19 నుంచి 22 ఎంపీ స్ధానాలు గెలుచుకునే అవకాశం ఉంది అని తేలిందట. దీంతో అమిత్ షా ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు అని తెలుస్తోంది. జగన్ తో భేటీ అవుతారట కచ్చితంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మీటింగ్ ఉంటుందని చెబుతున్నారు

అయితే ఇప్పటికే బీజేపీకి వైసీపీకి మధ్య ఒప్పందం ఉంది అని తెలుగుదేశం విమర్శలు కూడా చేస్తోంది. అయితే ఏపీలో జగన్ గెలిచినా బాబు గెలిచినా బీజేపీ మిత్ర బంధం కోసం తాపత్రయం పడుతుంది అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం.. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ సీట్లు బీజేపీ సాధించకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ ఇలా రెండు కూటములుగా విడిపోయి కాషాయం పార్టీకి అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాయి సో అందుకే షా ముందు నుంచే చర్చలు జరుపుతున్నారట.