టీమిండియా క్రికెట్ టీమ్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా
ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ… ఈ సినిమా ధోనీ అభిమానులకి బాగా నచ్చింది, ఇక ఈ సినిమాలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే, ఇక అతని అభిమానులు ఇంకా ఆ బాధలోనే ఉన్నారు.
అయితే ఇప్పుడు ఆ సినిమాలో నటించిన మరో నటుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
సందీప్ నహర్ నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబై, గోర్‌గావ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, ఇక ఓ వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇక తనకు ఉన్న వ్యక్తిగత సమస్యలు భార్యతో విభేదాల కారణంగా ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాశాడు, ఇక ఇందులో తన భార్య తప్పు లేదని నా ఆత్మహత్యకు కారకులు ఎవరూ కాదు అని తెలిపాడు
అతను.. కొంత కాలంగా ముంబైలో ఒంటరిగా ఉంటున్నాడు, ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు వున్నీరు అవుతున్నారు.